రేపటి అవిశ్వాస తీర్మానానికి టీడీపీ, సీపీఐల మద్దతు కోరిన వైయస్ ఆర్ సీపీ ఎంపీలు !

Friday, March 16th, 2018, 03:05:15 AM IST

వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విభజన హామీలు నెరవేర్చడం లో కేంద్ర ప్రభుత్వం విఫలం కావడంతో ,అలానే రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా ఇస్తామని ఒప్పుకుని ఇప్పుడు మాట మార్చడంతో పలు నిరసనలు చేసిన పిదప రేపు కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా లోక్ సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్మానానికి మద్దతు ఇవ్వవలసిందిగా అధికార టిడిపి అలానే వామపక్ష సీపీఐ నేతలను కలిసి ఈ సందర్భంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ నేతలు లేఖలు ఇవ్వడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా టిడిపి ,సిపిఐ రెండు పార్టీలు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి ఈ మేరకు నిర్ణయించినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడవలసి వుంది….