టిఆర్ఎస్ లో చేరనున్న వైఎస్ఆర్ అనుచరుడు!

Wednesday, May 9th, 2018, 11:29:58 PM IST


మాజీ కాంగ్రెస్ వరంగల్ జిల్లా సీనియర్ నేత చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి ఇన్నాళ్లు కాంగ్రెస్లో వున్నారు. కాగా ఆయన నేడు టిఆర్ఎస్ లో చేరనున్నారు. ఆయనతోపాటు అక్కడి స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్లు, కార్యకర్తలు కూడా ఆ పార్టీలో చేరనున్నారు. కాగా వారు టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో చేరనున్నారని ఎమ్యెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ లో మంచి పేరున్న నేతగా ఎదిగిన చెరుకుపల్లి శ్రీనివాసరెడ్డి కొన్నాళ్ళు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశారు.

అలానే వరంగల్ లో మునిసిపల్ చైర్మైన్ గా కూడా ఆయనకు మంచి అనుభవం వుంది. దివంగత వుమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్య అనుచరుల్లో చెరుకుపల్లి ఒకరని, వైఎస్ కు తలలో నాలుకవలె చెరుకుపల్లి వ్యవహరించడంతో వైఎస్ కూడా చెరుకుపల్లి పై ఎంతో ప్రేమతో మెలిగేవారని స్థానికనేతలు చెపుతున్నారు. ఆయన ఎప్పుడు వరంగల్ వచ్చినా చెరుకుపల్లి మంచి ఆతిథ్యంతో ఆహ్వాహించేవారని, అయితే వైఎస్ మరణాంతరం చెరుకుపల్లి స్థానిక కాంగ్రెస్ కు కొంత వరకు దూరమయ్యారు. కాగా నేడు అటువంటి నేత టిఆర్ఎస్ లో చేరడం శుభ పరిణామమని టిఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి…..