వైఎస్సార్ కుటుంబం… జగన్ ప్రయాణం మామూలుగా లేదుగా!

Monday, September 25th, 2017, 09:59:57 AM IST


వైసీపీ అధినేత జగన్ రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేయాలని, రెండేళ్ళలో రానున్న ఎన్నికలకి ఇప్పటి నుంచి కేడర్ ని సిద్ధం చేసేసాడు. అధికార టీడీపీ మీద ప్రజల్లో ఉన్న వ్యతిరేకతని అవకాశంగా చేసుకోవడంతో పాటు. వైసీపీ ప్రజల పార్టీని అందరిని చెప్పే ప్రయత్నంలో వినూత్న ఆలోచనతో చేపట్టిన వైఎస్సార్ కుటుంబంతో ఇప్పుడు వైసీపీ పార్టీ నూతనోత్సాహంతో ప్రజల మధ్యకి వెళ్తుంది. గెలుపే లక్ష్యం. ప్రజల విశ్వాసం పొందడమే లక్ష్యంగా పార్టీ క్రింది స్థాయి నుంచి వైఎస్సార్ కుటుంబంలో ఎవరికీ వారు స్వచ్చందంగా వెళ్లి పాల్గొని పార్టీ గురించి ప్రచారం చేస్తూ, అలాగే అధికారంలో వస్తే తాము ప్రజల కోసం చేయబోయే కార్యక్రమాలు ఎలా ఉంటాయి అని అర్ధమయ్యేల చెప్పడం ఈ వైఎస్సార్ కుటుంబంలో ముఖ్య ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. జనం కూడా జగన్ మొదలు పెట్టిన ఈ వైఎస్సార్ కుటుంబం కార్యక్రమం ద్వారా చేసే యక్టివిటీస్ కి కాస్తా కనెక్ట్ అవుతున్నారు.

మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో నంద్యాలలో పార్టీ ఓడిపోవడం వెనుక బలమైన కారణాలు లేకపోయిన. తమ నాయకులు అధికార పార్టీని టార్గెట్ చేసుకొని చేసిన నెగిటివ్ పబ్లిసిటీ కొంత తమ మీద ఎఫెక్ట్ చూపించినట్లు అర్ధం చేసుకున్నారు. దాంతో పాటు కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఓటమిపై అంతర్గత విశ్లేషణ చేసుకున్న అధిష్టానం ప్రస్తుతం పూర్తి క్లేరిటితో ఉన్నట్లు తెలుస్తుంది. కేవలం రెండు చోట్ల ఓడిపోవడానికి ప్రధానం కారణం ఇంకా ప్రజల విశ్వాసం సొంతం చేసుకోకపోవడమే అని అర్ధం చేసుకున్న అధినాయకత్వం తమ కొత్త ఆలోచనలకి పదును పెట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయంగా నిలబడాలన్నా, గెలవాలన్నా ప్రజల విశ్వాసం కచ్చితంగా ఉండాలి. అలా ఉండాలంటే ప్రజలకి చేరువ అవ్వడం ఒక్కటే ముందున్న అవకాశం. ఈ ప్రయత్నంలో భాగంగా ఎంచుకున్న వైఎస్సార్ కుటుంబం కార్యక్రమానికి ఇప్పుడు జగన్ కి ప్రజల నుంచి విశేషంగా మద్దతు లభిస్తుంది. ఈ కార్యక్రమం ద్వార ఇంటింటికి వెళ్లి, చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకి ఇచ్చిన వాగ్దానలని ఎలా గాలికి వదిలేసింది. ప్రజలని ఎలా మోసం చేస్తుంది. మూడేళ్ళ కాలంలో ఒక్క అడుగు కూడా నవ్యాంధ్ర నిర్మాణం కోసం ముందుకి పడకపోవడంలో చంద్రబాబు పాత్ర ఎంత ఉంది అనే విషయాలని చెప్పడంతో పాటు, తాము అధికారంలోకి రావడం చేసే కార్యక్రమాలు ఏంటి అనే విషయాలని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్టోబర్ నుంచి జగన్ మహా పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్న పక్షంలో ప్రజల మద్దతుని వీలైనంత సొంతం చేసుకోవాలని వైసీపీ అధిష్టానం చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా కొంత సానుకూల ఫలితాలు అయితే వస్తున్నాయి. మరో ఈ జగన్ చేస్తున్న ఈ భగీరథ ప్రయత్నంతో వైసీపీ అధికారంలో వస్తుందా? ప్రజల అభిమానం జగన్ ఎ మేరకు సొంతం చేసుకుంటాడు అనేది చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments