వైఎస్.జగన్ ఎందుకిలా నమ్మించి ముంచేస్తున్నారు.?

Tuesday, October 2nd, 2018, 01:57:03 PM IST

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు దీనితో ఏ పార్టీకి సంబందించిన కార్యకర్తలు వారి పార్టీ అధ్యక్షులు నిర్దేశించిన ఆదేశాల మేరకు వారి పనుల్లో నిమఘ్నమై ఉన్నారు.కానీ వైసీపీ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నటు వంటి నమ్మకస్తులైన నేతల పట్ల జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ఇప్పుడు ఆ పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు.ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న వారిని తప్పించి రోజుల వ్యవధిలో వచ్చిన వారికి మాత్రం వెంటనే పగ్గాలు కట్టబెడుతున్నారని వాపోతున్నారు.

జగన్ తీరు వల్ల అన్యాయం అయ్యిన వారి జాబితా దగ్గరకి ఒక ఇరవై మందిని దాటే ఉంది అని తెలుస్తుంది.ఐతే వీరిలో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే వంగవీటి రాధ గారు,బొమ్మి రెడ్డి రాఘవేంద్ర రెడ్డి,నిన్ననే కొత్తగా అప్పి రెడ్డిలు ఉన్నారు,ఐతే వీరు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నారు కానీ ఇప్పుడు మాత్రం జగన్ వీరికి మొండి చెయ్యి చూపిస్తున్నారు.అని వారు వాపోతున్నారు జగన్ కూడా ఈ సారి ఎలా అయినా సరే అధికారంలోకి రావాలని ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టు కూడా అనుకోవచ్చు కానీ బొమ్మి రెడ్డి రాఘవేంద్ర రెడ్డి మాత్రం జగన్ తన పార్టీలో సీనియార్టీ కన్నా ఆర్ధిక బలం ఉన్న వ్యక్తులకే ఎక్కువ ప్రాధ్యానయత ఇస్తున్నారని,అప్పటి వరకు సర్వేల్లో తనకే బలం,ఆదరణ ఎక్కువున్నాయని నమ్మించి చివరి నిమిషంలో ముంచేశారని వాపోయారు.ఇదే విధంగా ఇంకా చాలా మంది అభ్యర్థులు జగన్ వైఖరి పట్ల అతను తీసుకుంటున్న నిర్ణయాల పట్ల మనస్తాపానికి గురైన వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది.