ఏపీ బిగ్‌ఫైట్ : ఎన్నిక‌ల ఫ‌లితాలు త‌ర్వాత.. వైసీపీని టార్గెట్ చేస్తూ.. టీడీపీ భారీ కుట్ర‌..?

Tuesday, April 23rd, 2019, 01:15:38 PM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు హోరాహోరీగా జరిగాయి. ఇక ఫైన‌ల్ రిజ‌ల్ట్ కోసం స‌ర్వ‌త్రా ఆశ‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం ఎవ‌రిని వ‌రిస్తుందో అనే విష‌యం పై ఓట‌రు నాడి ఎవ‌రికీ అంతుచిక్క‌డంలేదు. మ‌రోసారి తామే గెలుస్తామ‌ని టీడీపీ అంటుంది. త‌మ‌కు 140 సీట్లు క‌చ్ఛితంగా వ‌స్తాయ‌ని చెబుతున్నా ఈవిఎంల మొరాయింపు పై ప‌దేప‌దే ఆరోప‌లు చేస్తుండ‌డంతో టీడీపీ నేత‌ల‌కు గెలుపు పై ధీమా లేద‌ని విశ్లేష‌కులు అభిప్రాయప‌డుతున్నారు.

మ‌రోవైపు వైసీపీ కూడా గెలుపు ఎంతో ధీమాగా ఉంది. త‌మ‌కు 120 సీట్లు ప‌క్కా అంటోంది. మెజారిటీ ప్ర‌జ‌లు వైసీపీ గెలుస్తుంద‌ని ధీమాతో ఉన్నారు. ఈ క్ర‌మంలో వైసీపీ మ్యాజిక్ ఫిగ‌ర్ కంటే ఎక్కువ సీట్లు సాధించినా టీడీపీ ప‌రిస్థితిని తారుమారు చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఎలా అంటే గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ్యాజిక్ ఫిగ‌ర్ వ‌చ్చినా వైసీపీని పూర్తిగా నిర్వీర్యం చేయ‌డానికి, వైసీపీ నండి 23 మంది ఎమ్మెల్యేల‌ను త‌న‌వైపు తిప్పుకుంది.

అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చేందుకు ఎమ్మెల్యేలను వారివైపు తెచ్చుకునేందుకు ఎంతటి ప్రయత్నం అయినా చేస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. అందుకే గెలిచిన ఎమ్మెల్యేలు చేజారకుండా చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాలకు జగన్ ఎన్నికల ఇంఛార్జిలను నియమించారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కూడా గెలిచిన వారు రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి సర్టిఫికేట్ తీసుకోగానే వారిని ఒక్క చోటకు చేర్చి పార్టీ కార్యాలయానికి తీసుకురావాల్సిన బాధ్యతలను పార్లమెంటరీ ఇంఛార్జిలపై పెట్టనున్నారు. దీంతో టీడీపీ వేసే ఎత్తుల‌ను వైసీపీ చిత్తు చేయ‌డానికి వైసీపీ సిద్ధంగా ఉంద‌ని స‌మ‌చారం.