అరెస్టులతో నినాదాలతో హోరెత్తుతున్న వైసిపి బంద్!

Tuesday, July 24th, 2018, 11:20:49 AM IST

ప్రత్యేక హోదా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బంద్ కి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ రోజు తెల్లవారుజాము నుంచే వైఎస్సార్ సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాలను చేపట్టారు ఇక బంద్ జరుగుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం నాటి ప్రజా సంకల్పయాత్రకు విరామం ప్రకటించారు. పాదయాత్ర బుధవారం తిరిగి ప్రారంభం అవుతుంది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తెల్లవారు జాము నుంచే బంద్ లో పాల్గొంటున్నారు. విజయవాడలో బంద్ నిర్వహించిన వైయస్ఆర్ సీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక ఈ బంద్ ను తెలుగుదేశం పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోంది.

ఫొటోల కోసం క్లిక్ చేయండి

  •  
  •  
  •  
  •  

Comments