2019 ఎల‌క్ష‌న్స్ : వైసీపీ తొలి జాబితా.. జగన్ సంచ‌ల‌న నిర్ణ‌యం..?

Saturday, March 16th, 2019, 12:50:16 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎల‌క్ష‌న్స్ ఫీవ‌ర్ స్టార్ట్ అయ్యింది. అన్ని పార్టీలు అభ్య‌ర్ధుల జాబితాలు ఫైన‌లైజ్ చేసే ప‌నిలో బిజీ బిజీగా ఉన్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే తెలుగుదేశం పార్టీ 126 మందితో కూడాని టీడీపీ అసెంబ్లీ అభ్య‌ర్ధుల తొలి జాబితాను విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇక మ‌రోవైపు జ‌న‌సేన పార్టీ కూడా తొలి జాబితాను ప్ర‌క‌టించింది. ఇటీవ‌ల మొత్తం 36 మందితో కూడిన జాబితాను విడుద‌ల చేయ‌గా, అందులో అసెంబ్లీకి 32 మందిని, పార్ల‌మెంట్‌కు 4 మందిని ఎంపిక చేశారు జ‌న‌సేన అధినేత పవ‌న్ క‌ళ్యాణ్‌. మిగ‌తా అభ్య‌ర్ధుల‌ను త్వ‌ర‌లో ప్ర‌క‌టించనున్నారు.

అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు అభ్య‌ర్ధుల జాబితాను ప్ర‌క‌టించ‌లేదు. నిజానికి ఈరోజు ఉద‌యం ఇడుపులపాయ‌లో అభ్య‌ర్ధుల జాబితాను విడుద‌ల చేయాల‌నుకున్నారు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అయితే అనుకోకుండా వివేకానంద‌రెడ్డి హత్య‌తో అభ‌ర్ధుల జాబితా విడుద‌ల‌ను వాయిదా వేశారు.

అయితే తాజా మ్యాట‌ర్ ఏంటంటే.. అనుకున్న విధంగానే ఈరోజు వైసీపీ అభ్య‌ర్ధుల తొలిజాబితాను జ‌గ‌న్ విడుద‌ల చేయ‌నున్నార‌ని వైసీపీ వ‌ర్గాలు నుండి స‌మాచారం వ‌చ్చింది. బాబాయ్ వివేకానందరెడ్డి హ‌త్య‌తో తీవ్ర విషాదంలో ఉన్న జ‌గన్, ఎట్టి ప‌రిస్థితుల్లో ఈరోజే అభ్య‌ర్ధ‌లు జాబితాను విడుద‌ల చేసి, పార్టీ శ్రేణుల్ని మ‌రింత బ‌లంగా క్షేత్ర స్థాయిలో బ‌లంగా వెళ్ళాల‌ని సూచించ‌నున్నార‌ని తెలుస్తోంది. ఇక మ‌రోవైపు ఈరోజు గ‌వ‌ర్న‌ర్‌ని క‌లిసి, బాబాయ్ హ‌త్య కేసు విష‌యంలో సీబీఐ ద‌ర్యాప్తు కోర‌నున్నారు జ‌గ‌న్.