వైరల్ వీడియోలు : జగన్ అనే నేను..

Thursday, April 19th, 2018, 12:04:50 PM IST

భరత్ అనే నేను పోయి జగన్ అనే నేను వచ్చిందేంటా అని చూస్తున్నారా..? అవును గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్సీపీ అభిమానులు తమ ప్రియతమ నేత జగన్ కోసం కొత్తరకం ప్రమోషన్స్ మొదలు పెట్టారు. తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను సినిమా తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కి ముందే భారీ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అదే క్రమంలో సినిమా టైటిల్ సాంగ్ అయిన భరత్ అనే నేను, మరియు వచ్చాడయ్యో సామి పాటలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి.

మహేష్ బాబు ముఖ్యమంత్రిగా నటిస్తున్న ఈ చిత్రంలో పాటలు కూడా రాజకీయ vyavasthaku సంబందించిన విధంగా సంగీతాన్ని కూర్చారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్. ఇప్పుడు అసలు విషయంలోకి వస్తే ఓ వైపు అవినీతి కుంభకోణంలో చిక్కుకొని సీబీఐ దర్యాప్తుల్లో ప్రతీ శుక్రవారం కేసు విచారణకు హాజరవుతూ కూడా గత 140 రోజులుగా వచ్చే ఎన్నికల్లో ఏపీకి సీఎం పదవి సాధించడం కోసం ఊరూరా తిరిగి ప్రత్యక్షంగా ప్రజల సమస్యలు తెలుసుకుంటానని ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా కృషి చేస్తున్నాడో అందరికి తెలిసిన విషయమే. అయితే తన అభిమానులు భరత్ అనే నేను సినిమాలోని ఫేమస్ అయిన రెండు పాటలను తీస్కోని వాటిని జగన్ కి మ్యాచ్ అయ్యేలా రీ ఎడిట్ చేసారు. ఇప్పుడు ఆ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అయి లక్షల్లో వ్యూలు, లైకులు సొంతం చేస్కుంటున్నాయి. జగన్ అభిమానులు చేసిన ఆ పాటలపై మీరూ ఓ లుక్కేయండి.

  •  
  •  
  •  
  •  

Comments