ఏపీలో లోకేష్ టాక్స్ .. రాంబాబు సంచలన ఆరోపణలు..!

Sunday, September 18th, 2016, 03:47:12 AM IST

ambati1
తెలంగాణాలో గ్యాంగ్ స్టర్ నయీమ్ టాక్స్ కట్టించుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ టాక్స్ కట్టించుకుంటున్నాడని వైసిపి నేత అంబటి రాంబాబు సంచలన ఆరోపణలు చేసారు.లోకేష్ అంటేనే అవినీతికి కేరాఫ్ అని ఆరోపించారు. సీఎం చంద్రబాబు తనకుమారుడిని సీఎం చేయాలనుకుంటున్నారని .. కానీ అది ఎప్పటికి జరిగే పని కాదని అన్నారు.

వైసిపి ఆంద్రప్రదేశ్ అభివృద్ధి కి అడ్డుపడుతోందని చంద్రబాబు ఆరోపించడం అర్థరహితం అని అంబటి రాంబాబు అన్నారు.వైసిపి పై కక్ష సాధించాలనే ఉద్దేశం తోనే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని రాంబాబు మండిపడ్డారు.దేశ వ్యాప్తంగా 954 బిలియన్ పెట్టుబడులు వస్తే అందులో ఏపీ కి మాత్రమే 15.6 శాతం పెట్టుబడులు వచ్చాయనడం అర్థరహితం అని అన్నారు.