మైసూరా రెడ్డి.. రెడీ టూ జంప్..?

Monday, November 28th, 2016, 05:40:55 PM IST

maisura-reddy
తిరిగి తిరిగి ఏ గూటి పక్షులు ఆ గూటికి చేరడం అంటే ఇదేనేమో. గతం లో టిడిపి లో ఉన్న మైసూరా రెడ్డి కడప జిల్లా రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగారు.వైఎస్ మరణానంతరం చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన వైసిపి లో చేరారు. 2014 ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందడంతో పార్టీ కి దూరంగా ఉంటూ వచ్చారు. అనంతరం ఆయన తాను వైపిపిని వీడుతున్నట్లు ప్రకటించారు.గత కొంతకాలంగామౌనంగా ఉన్న తాజా ఆయన టిడిపి లో చేరబోతున్నారంటూ ప్రచారం ఓ ఊపందుకుంటోంది. దీనికి కారణం లేకపోలేదు. కడప జిల్లాకు చెందిన టిడిపి నేత రాజ్యసభ సభ్యడు సీఎం రమేష్.. మైసూరా రెడ్డి తో భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

త్వరలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యం లో వీరి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.త్వరలో మైసూరా టిడిపి లో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మైసురాతో భేటి అయిన సీఎం రమేష్ ఆయనతో పార్టీ చేరే విషయం చర్చించినట్లు తెలుస్తోంది. మైసూరా కనుక టిడిపి లో చేరితే జగన్ కు సొంత ఇలాకాలో మరో గట్టి దెబ్బ తగిలినట్లే అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.