మోడీకి రెస్పెక్ట్ ఇవ్వాలట.. వైకాపా నేతల డిమాండ్ !

Tuesday, February 12th, 2019, 09:09:41 AM IST

మోడీ గుంటూరులో సభ ఎందుకు పెట్టారో జనానికి ఇప్పటికీ అంతుపట్టడంలేదు. వచ్చారు.. పోయారే తప్ప హోదా గురుంచి హామీ ఇవ్వనేలేదు. చంద్రబాబును తిట్టడం, నిరసనల్ని వ్యంగ్యంగా తీసుకుని ఛలోక్తులు విసరడం లాంటి చమత్కారాలు చూపి వెళ్లిపోయారు. రానివ్వండి చూద్దాం.. అనుకుని ఆయన రాకను మొదట్లో సమ్మతించిన జనం సైతం మోడీ మాటలు విని ఈమాత్రానికి ఇక్కడి దాకా రావడం ఎందుకు డిల్లీ నుండే తిట్టవచ్చు కదా అంటున్నారు.

ఇలా అందరూ మోడీని తిట్టిపోస్తుంటే వైకాపా నేతలు మాత్రం ఆయనకు ప్రొటొకాల్ ప్రకారం మర్యాదలు చేయలేదని వాపోతున్నారు. వైకాపా నేత ఆనం రామనారాయణరెడ్డి రాష్ట్రానికి అతిధిగా వచ్చిన మోడీని గౌరవించటం ముఖ్యమంత్రి కనీస భాద్యతని గుర్తుచేశారు. అంతేకానీ ప్రధాని హోదా విషయంలో మోసం చేసిన సంగతిపై స్పందించట్లేదు. అయినా మర్యాద గురుంచి అంత పట్టింపులున్న వైకాపా నేతలు గౌరవ ముఖ్యమంత్రిని జగన్ కాల్చి పారేయాలని నోరు జారడం, దున్నపోతు అంటూ తిట్టడాన్ని ఎందుకు వ్యతిరేకంచలేదో మరి.