అక్కడ రేవంత్ ను వేస్తే ఇక్కడ బాబును వేయాలట!

Saturday, September 29th, 2018, 01:00:46 AM IST

నిన్న ఉదయం నుండి తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ దాడులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో రేవంత్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు అధికారులు చెబుతున్నారు. దీనిపై టీ కాంగ్రెస్ నేతలు అందరూ కేసిఆర్, మోడీ కుమ్మక్కై రేవంత్ మీద పగ సాధిస్తున్నారని గుండెలు బాదుకుంటుంటే ఏపీలో మాత్రం వైకాపా నేతలు అక్కడ రేవంత్ పై సోదాలు చేస్తూ ఇక్కడ చంద్రబాబును వదిలేసారేందుకని గొంతు చించుకుంటున్నారు.

అంతేకాదు రేవంత్ ఇంట్లో దొరికిన, ఇంకా దొరకబోయే అక్రమ ఆస్తులు మొత్తం చంద్రబాబువేనని బల్లగుద్ది చెబుతున్నారు. మళ్ళీ ఓటుకు నోటు కేసును ప్రస్తావిస్తూ నేరం చేసిన ముఖ్యమంత్రికి శిక్షలు ఉండవా అని ప్రశ్నిస్తున్నారు. ఒక పక్కన ఐటీ అధికారులేమో ఇవి పూర్తిగా రేవంత్ ఆదాయ వివరాలను తెలుసుకునేందుకు చేస్తున్న సోదాలే తప్ప ఇందులో వేరే ఉద్దేశ్యం లేదని అంటుంటే వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర రెడ్డి మాత్రం అక్కడ రేవంత్ ను బాబును కూడ వేయాల్సిందే లేకుంటే ఒప్పుకునేదే లేదు అంటున్నారు.