ప‌వ‌న్ క‌ళ్యాణ్ అందుకోసం.. ఎంత ప్యాకేజ్ మాట్లాడుకున్నావ్..?

Saturday, January 12th, 2019, 02:00:40 PM IST

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా మాట్లాడుతూ.. గ‌తంలో జ‌న‌సేన‌కు బ‌లం లేద‌ని చెప్పిన వారే ఇప్పుడు మాతో పొత్తు పెట్టుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని, తాము ఎవ‌రితో పొత్తు పెట్టుకోమ‌ని తేల్చిచెప్పినా రాయ‌భారాలు న‌డుపుతున్నార‌ని, ఈ క్ర‌మంలో ప్రతిప‌క్ష వైసీపీ త‌మ‌తో పెట్టుకోవ‌డానికి అనేక విధాలుగా ప్ర‌య‌త్నిస్తోంద‌ని, ఈ నేప‌ధ్యంలో ఆ పార్టీతో పెట్టు కోవాల‌ని కొంద‌రు టీఆర్ఎస్ నేత‌లు సంప్ర‌దించార‌ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌లు చేసి ఒక్క‌సారిగా రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ర‌చ్చ లేపిన సంగ‌తి తెలిసిందే.

అయితే తాజాగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ్యాఖ్య‌ల పై వైసీపీ నేత‌లు స్పందించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ ఒంట‌రిగానే బ‌రిలోకి దిగుతామ‌ని వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇప్ప‌టికే తేల్చి చెప్పార‌ని, వైసీపీతో జ‌న‌సేన పోత్తు కోసం ప‌వ‌న్‌ని క‌లిసిన టీఆర్ఎస్ నేత‌లు ఎవ‌రో చెప్పాల‌ని వైసీపీ అధికార ప్ర‌తినిధి సుధాకర్ బాబు డిమాండ్ చేశారు. నాడు టీడీపీతో ప్యాకేజ్ మాట్లాడుకొని ఓపెన్‌గా మ‌ద్ద‌తు తెలిపి రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ప‌వ‌న్, ఇప్పుడు ర‌హ‌స్యంగా చంద్ర‌బాబుతో కాపురం చేస్తూ.. వైసీపీ పై లేనిపోని నిందలు వేస్తే చూస్తూ ఊరుకోమ‌ని, అస‌లు టీఆర్ఎస్ నేత‌లు వైసీపీ త‌రుపున పొత్తుగురించి ప‌వ‌న్‌తో ఎందుకు మాట్లాడుతారు.. వైసీపీలో నేత‌లు లేరా.. ఇలాంటి ఆధారాలు లేని వ్యాఖ్య‌లు చేయ‌డానికి చంద్ర‌బాబు ద‌గ్గ‌ర ఎంత ప్యాకేజీ మాట్లాడుకున్నారో చెప్పాల‌ని వైసీపీ శ్రేణులు ప్ర‌శ్నించారు. జ‌న‌సేన‌తో పొత్తుకోసం రాయ‌భారాలు న‌డ‌పాల్సిన అవ‌స‌రం జ‌న‌గ్‌కు లేద‌ని ప‌వ‌న్‌కు దమ్ముంటే చేసిన వ్యాఖ్య‌లు నిరూపించుకోవాల‌ని వైసీపీ నేత‌లు డిమాండ్ చేశారు.