శాసనసభాపక్ష సమావేశం సాక్షిగా రోజా హోంమంత్రి అయిపోయినట్టేనా..!

Sunday, May 26th, 2019, 12:40:56 AM IST

ఏపీలో గత నెలలో ముగిసిన సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మొన్న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలలో భారీ మెజారిటీతో వైసీపీ విజయాన్ని సాధించింది. అయితే ఈ నెల 30న వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే అందుకు సంబంధించి నేడు తాడేప‌ల్లిగూడెంలోని వైసీపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశంలో వైసీపీ శాసనసభాపక్ష నేతగా ఆ పార్టీ ఎమ్మెల్యేలు జగన్‌ను ఎన్నుకున్నారు.

అయితే సమావేశం ముగిసిన అనంతరం నగరి ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ దేవుడున్నాడని అందుకే టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ భారీ విజయాన్ని సొంతం చేసుకుందని, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాబోతున్నారని అన్నారు. అయితే జగన్ కేబినెట్‌లో మీకు హోం మంత్రిని ఇస్తున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి దీనిపై మీ స్పందన ఏంటీ మీడియా అడగగా తాను ప్రజలకు సేవ చేయడానికే రాజకీయాలలోకి వచ్చాను అందుకే ఎమ్మెల్యే కావలనుకున్నాను జగన్ దయ వలన 2014 లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందాను. ఈ సారి కూడా వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందాను. జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న ఆయనతో పాటు కలిసే పనిచేస్తానని, ఆయన ఆదేశాలకు కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చారు.