ఏపీకి హోదాకోసం మోదీ కాళ్ళు పట్టుకున్న విజయసాయి

Tuesday, March 27th, 2018, 03:35:36 PM IST

ప్రత్యేక హోదా విషయం రోజు రోజుకూ కొత్త కార్య చరణాలకు కాలు మోపుతుంది. ఇటివల రాజ్యసభలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకున్నది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ కాళ్లను మొక్కారు. ఉదయం సభలోకి ప్రధాని వస్తున్న సమయంలో ఎంపీ విజయసాయి రెడ్డి నమస్కారం చేశారు. ప్రధాని మోదీ కూడా వైఎస్‌ఆర్‌సీపీ నేతకు ప్రతినమస్కారం చేశారు. ఆ తర్వాత ప్రధాని వద్దకు వెళ్లి పాదాభివందనం చేసి ఇలా చివరికి ప్రత్యేక హోదా విషయంలో కాళ్ళు పట్టుకునే స్థితికి వచ్చానని, అయినా పర్వాలేదు అంతటి మాహానుభావుని కాళ్ళు పట్టుకోవడం తప్పేమీ కాదని మాట్లాడారు. ప్రధాని కూడా ఎంపీని తట్టిలేపారు. ఆ తర్వాత ఎంపీ విజయసాయి రెడ్డి తన బెంచ్ దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. గత కొన్ని రోజులగా ఎంపీ విజయసాయి రెడ్డి ఆంధ్రాకు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ పార్లమెంట్‌లో నిరసన చేపట్టారు. కొన్ని రోజుల క్రితం ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ తొలి అంతస్తులో నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం వైసీపీ అవిశ్వాసనం తీర్మానం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇక మోదీ మాత్రం ఈ విషయంపై ఎలాంటి నిర్ణయం తీస్కోకపోగా ఎవ్వరు ఏం చేసినా నేను తీస్కున్న నిర్ణయం మార్చుకోను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.