ఏపీ హోదాకై వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామా..?

Friday, April 6th, 2018, 11:27:42 AM IST

కేంద్రం ఏమీని గాలికి వదిలేసినంత పని చేస్తుంది. ఇన్ని ఆందోళనలు జరిగినా, సమ్మెలు జరిగినా అవిశ్వాస తీర్మానాలు చేసినా విషయం ఇంచు మన్దమ్ అయినా జరగట్లేదు. ఎన్ని రోజులు గడిచినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలకు తావునివ్వట్లేదు. ఇక చేసేదేం లేక ఈ సారి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా డిమాండ్ చేస్తూ వైఎస్పార్ కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు లోక్‌స‌భ ఎంపీలు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామాలు చేయడానికి సిద్దమయ్యారు. లోక్‌స‌భ స్పీక‌ర్ సుమిత్ర మ‌హాజ‌న్‌ను క‌లిసి త‌మ రాజీనామాలు అంద‌జేయ‌నున్నారు. ఎంపీలు మిథున్ రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్ రెడ్డి, వరప్రసాద రావు రాజీనామాలు చేసే వాళ్లలో ఉన్నారు. ఆ పార్టీ రాజ్యసభ ఎంపీలు కూడా రాజీనామా చేస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు.

  •  
  •  
  •  
  •  

Comments