ఉండ‌వ‌ల్లి అఖిల‌ప‌క్ష స‌మావేశం.. వైసీపీ సంచ‌ల‌న నిర్ణ‌యం..!

Tuesday, January 29th, 2019, 10:42:30 AM IST

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అఖిల‌ప‌క్ష స‌మావేశానికి రాజ‌కీయ‌పార్టీల‌న్నీ హాజ‌రు కావాలని పిలుపునిచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే అఖిలపక్ష సమావేశానికి దాదాపు రాజకీయ పార్టీలన్నీ హాజరువుతుండగా వైసీపీ మాత్రం దూరంగా ఉండ‌నుంది. తెలుగుదేశం పార్టీ హాజరు ఉంటే తాము ఈ సమావేశంలో భాగస్వామ్యం కాలేమని వైసీపీ తేల్చి చెప్పింది. ఎన్నికల వేళ టీడీపీతో వేదిక పంచుకునే అవకాశం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని టీడీపీ నిర్ణ‌యించుకుంది.

అఖిలపక్షానికి హాజరు కావాలని సీయం చంద్రబాబు నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో టీడీపీ త‌రుపున మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనంద్‌బాబు, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌, ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు హాజరుకానున్నారని స‌మాచారం. ఈ సమావేశానికి వైసీపీ తప్ప మిగిలిన పార్టీలన్నీ హాజరువుతున్నాయని ఉండవల్లి ప్రకటించారు. ఇక ఈ స‌మావేశంలో కేంద్రం బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలన్న విషయాన్ని చ‌ర్చిచ‌నున్నార‌ని, రాష్ట్ర‌ప్ర‌యోజ‌నాల కోసమే ఈ స‌మావేశాన్ని నిర్వ‌హిస్తున్నామ‌ని ఉండ‌వ‌ల్లి తెలిపారు.