వైసిపి సెంచరీ.. జనసేన శూన్యం..!

Wednesday, January 24th, 2018, 02:55:36 AM IST

దేశవ్యాప్తంగా ఎన్నికల హడావిడి అప్పుడే కనిపిస్తోంది. మీడియాలో 2019 ఎన్నికల గురించి రచ్చ మొదలైపోయింది. ముందస్తు ఎన్నికలు వస్తే తప్ప 2019 ఎలక్షన్ కు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో పార్టీల అధినేతలు కసరత్తు మొదలు పెట్టేయడంతో పొలిటికల్ హీట్ బాగా పెరిగిపోయింది. కాగా ముస్లిం జోతిష్యుడు అహ్మద్ ఖాన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ 2019 ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేశారు. తాను చెప్పిన జోస్యం ఇంతవరకు తప్పలేదని.. ఎన్నికల ఫలితాలు తాను చెప్పిన విధంగానే వస్తాయని నొక్కి చెబుతున్నాడు.

ఈయన ఆస్ట్రాలజీ ప్రకారం ఏపీలో వైసిపి విజయ ఢంకా మోగిస్తుందట. వైసీపీకి 105 స్థానాలు వస్తాయని, టీడీపీ 60 సీట్లకు మాత్రమే పరిమితం అవుతుందని, ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభావం ఉండదని ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదని నంబర్స్ తో సహా చెప్పేస్తున్నారు. ఇక తెలంగాణలో 95 సీట్లతో టిఆర్ఎస్ కు తిరుగుండదని చెబుతున్నారు. కేంద్రంలో మోడీ గట్టి పోటీని ఎదుర్కొన్నా విజయం సాధిస్తారని చెబుతున్నాడు. హేతువాది బాబు గోగినేని ఇదంతా వట్టి ట్రాష్ అని కొట్టి పారేసారు.