క్లీన్ స్వీప్: కర్నూల్ జిల్లాలో వైసీపీ గెలుచుకునే స్థానాలు ఇవే..!

Monday, April 22nd, 2019, 07:00:20 PM IST

ఏపీలో ఈనెల 11న సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముగిసాయి. అయితే ఫలితాలకు ఇంకా సమయం ఉండడంతో అందరిలో గెలుపుపై ఉత్కంఠత నెలకొంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడకముందే పార్టీలు, నేతలు గెలుపోటములపై ఎవరికి వారే అంచనాలు వేసుకుంటున్నారు. గత ఎన్నికలకన్నా ఈ సారి పోలింగ్ శాతం కూడా పెరగడంతో అది మా పార్టీకే కలిసివస్తుందని కొందరు, లేదు మా పార్టీకే కలిసివస్తుందని మరికొందరు వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత వెలువడిన అన్ని సర్వేలలో వైసీపీకే విజయవకాశాలు ఉన్నట్లు తెలుపుతున్నాయి. అయినా టీడీపీ మాత్రం తమకు 130 సీట్లు గెలుచుకుంటున్నామని, తప్పకుండా మళ్ళీ అధికారం తమదేనని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే వైసీపీ మాత్రం గెలుపుపై ఆత్మవిశ్వాసంతో ఉంది. అయితే అన్నీ సర్వేల లాగానే తాజాగా దరువు చానల్ వారు జిల్లాల వారిగా నిర్వహించిన సర్వేలలో కూడా వైసీపీకే ఎక్కువ సీట్లు వచ్చాయని తమ సర్వేలను వెల్లడించింది. అయితే ఈ సర్వే ప్రకారం కర్నూల్ జిల్లాలో వైసీపీ ఎన్ని స్థానాలను గెలుచుకుందో చూద్దాం.

కర్నూల్ జిల్లా అసెంబ్లీ స్థానాలు

ఆళ్ల‌గ‌డ్డ : వైసీపీ
శ్రీ‌శైలం : వైసీపీ
నందికొట్కూరు : వైసీపీ
క‌ర్నూలు : వైసీపీ
పాణ్యం : వైసీపీ
నంద్యాల : వైసీపీ
బ‌న‌గాన‌ల‌ప‌ల్లె : వైసీపీ
డోన్ : వైసీపీ
ప‌త్తికొండ : వైసీపీ
కోడుమూరు : వైసీపీ
ఎమ్మిగ‌నూరు : టీడీపీ
మంత్రాల‌యం : వైసీపీ
ఆదోని : వైసీపీ
ఆలూరు : వైసీపీ

మొత్తం : 14
వైసీపీ : 13
టీడీపీ : 1