ఇది యువ నేస్తమా లేక టీడీపీ కార్యకర్తల నేస్తమా ?

Sunday, October 7th, 2018, 05:10:44 PM IST

ఎన్నికలు దగ్గరపడుతుండటంతో మన ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు నాలుగేళ్ల క్రితం ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతి మొన్న హడావుడిగా మీటింగ్ పెట్టి ముఖ్యమంత్రి యువ నేస్తం పేరుతో ఒక్కొక్క నిరుద్యోగికి రూ.1000 భృతి ఇస్తున్నట్టు ప్రకటించారు. అర్హులైన యువత మొత్తం ఆన్ లైన్ లో రిజిస్టేషన్ చేసుకోవాలని చెప్పారు.

ఇది బయటి జనాలకు చెప్పిన మాట. కానీ లోపల వార్డు, గ్రామ స్థాయి నేతలకు నిరుద్యోగులుగా ఉన్న పార్టీ కార్యకర్తల మీద ప్రత్యేక శ్రద్ద పెట్టమని ఆదేశాలు వెళ్లాయట. అంటే పార్టీ కోసం పనిచేసే ఉద్యోగం లేని కుర్రాళ్లకు ముందు ప్రాధాన్యత ఇచ్చి ఆ తరవాత సామాన్యుల రిజిస్టేషన్లు చేయండని అందట అధిష్టానం.

దీంతో నాలుగేళ్లు ఆలస్యంగా భృతిని ప్రకటించి, అది కూడ అరకొరగా ఇవ్వబోతూ మధ్యలో ఈ పక్షపాత వ్యవహారాలు ఏమిటి. ఇది యువ నేస్తంలా లేదు కార్యకర్తల నేస్తంలా ఉందని సోషల్ మీడియాలో యువకులు తీవ్ర స్థాయిలో విమరిస్తున్నారు. మరి చెప్పిందెలాగూ సక్రమంగా చేయకుండా ఎన్నికల వేళ చేసే ఈ బుజ్జగింపు మంచినైనా కొంత పారదర్శకంగా, నిజాయితీతో చేస్తే బాగుంటుంది కదా బాబుగారు.