బాబు నిరుద్యోగ భృతి కేవలం ఓట్ల కోసం వేసిన ఎత్తుగడేనా.?

Tuesday, October 2nd, 2018, 11:19:52 AM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు ఆయన తనయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకం ముఖ్యమంత్రి యొక్క “యువనేస్తం” పథకం ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలోనూ ఈ స్థాయిలో నిరుద్యోగులకు భృతి అందించట్లేదు అని టీడీపీ వారు చెప్పుకుంటూ వస్తున్నారు.ఈ విషయాన్ని మనం సరిగ్గా గమంచినట్టైతే కాస్త తెలివిగా ఆలోచించే వారైనా సరే ఇది కేవలం ఓట్ల కోసమే చేసే ఎత్తుగడ అని చాలా సులభంగా చెప్పేయగలరు.

ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంలో ఏదో హడావుడి చేసేస్తున్నారు కానీ ఇందులో పెద్ద విశేషం ఏమి లేదు ఎందుకంటే ఇప్పుడు అమలు చేస్తున్న ఈ పథకం వల్ల ఇంకా అన్యాయమే జరుగుతుందనే చెప్పుకోవాలి.నిజానికి ప్రతీ నిరుద్యోగికి రావాల్సింది 1000 రూపాయల భృతి కాదు 2000 రూపాయలు,అది టీడీపీ వారు వారి ఎన్నికల మ్యానిఫెస్టోలోనే అప్పుడు పెట్టారు,బాబు వస్తే జాబు రాని పక్షాన ఈ పథకం అమలు చేస్తాం అన్నారు.

వచ్చిన నాలుగున్నర ఏళ్లకు మరి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులు గుర్తొచ్చారో ఏమో మరి అకస్మాత్తుగా నిరుద్యోగ భృతి అంటూ ఎవరు ఇవ్వని విధంగా ఇస్తున్నాం అంటూ డ్రామాలు ఆడుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.సరిగ్గా ఎన్నికలకి కేవలం కొన్ని నెలల ముందు మాత్రమే ఈ పథకాన్ని అది కూడా 1000 రూపాయలు తగ్గించి ఎదో పెద్ద ఘనకార్యం చేస్తున్నట్టు బాబు గారు లోకేష్ కేవలం ఓట్ల కోసం వేసే ఎత్తుగడే అని బల్ల గుద్ది చెప్తున్నారు.