అప్పుడే రిటైర్మెంట్ పై నిర్ణయం తీసుకుంటా: యువరాజ్

Monday, April 23rd, 2018, 03:16:58 PM IST

ఒకప్పుడు యువరాజ్ గ్రౌండ్ లో అడుగుపెట్టాడు అంటే బౌలర్లకు చుక్కలు కనిపించేవి. ఈ విషయం ప్రతి క్రికెట్ అభిమానులకు తెలుసు. టీమ్ ఏదైనా యువరాజ్ ధాటికి తోక మూడవల్సి వచ్చేది. కానీ కాలం ప్రతి ఆటగాడికి ఒకానొక సమయంలో పరీక్ష పెడుతుంది. ఫామ్ తో సతమతమయ్యే సందర్భాలు చాలానే ఉంటాయి. ప్రస్తుతం యువరాజ్ అదే పరిస్థితుల్లో వున్నాడు. గత కొంత కాలంగా యూవీ సిక్సర్ల మోత కనిపించడం లేదు. అప్పటిలా షాట్స్ పడటం లేదు.

అయినా కూడా యువరాజ్ ఏ మాత్రం నిరాశ చెందకుండా ఫామ్ లోకి వచ్చే విధంగా కృషి చేస్తున్నాడు. అయితే ప్రస్తుతం అతని రిటైర్మెంట్ గురించి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. ఫార్మాట్ తో సంబంధం లేకుండా అన్నిట్లో ఆడుతున్నప్పటికీ అనుకున్నంత స్థాయిలో ప్రతిభను కనబరచడం లేదు. అయితే రిటైర్మెంట్ గురించి టాక్ ఎక్కువగా రావడంతో యువీ ఇటీవల స్పందించాడు. గత 17 -18 ఏళ్ల నుంచి క్రికెట్ ఆడుతున్నా. ఎప్పుడో ఒకప్పుడు క్రికెట్ కు దూరం కావాల్సిందే. 2019 వరల్డ్ కప్ తరువాత రిటైర్మెంట్ పై నా నిర్ణయం ప్రకటిస్తాను. జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తా అని యువరాజ్ తెలిపాడు. వచ్చే ఏడాది ఇంగ్లాండ్ – వేల్స్ లో ప్రపంచ కప్ జరగనుంది. ప్రస్తుతం యూవీ కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments