సెంచరీలతో ఇంగ్లాండ్ ను ఉతికారేసిన పాతమిత్రులు..!

Thursday, January 19th, 2017, 06:00:03 PM IST

dhoni-uv
కటక్ లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో వన్డేలో టీం ఇండియా పరుగుల వరద పారించింది.25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న భారత జట్టుని యువరాజ్, ధోని లు ఆదుకున్నారు.తొలుత కుదురుకునేందుకు ప్రయత్నించిన వీరిద్దరూ నెమ్మదిగా వేగం పెంచి పరుగుల వరద పారించారు.ఇటీవల కెప్టెన్సీ కి గుడ్ బై చెప్పిన ధోని స్వేచ్ఛగా బౌండరీలు బాదాడు. కాగా చాలా కాలం తరువాత ఈ సిరీస్ తో జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన యువరాజ్ తనదైన శైలిలో చెలరేగి అభిమానులను ఉత్సాహ పరిచాడు. టాస్ గెలిచినా ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ ఫీల్డింగ్ వైపే మొగ్గు చూపాడు.మొదట అతడి నిర్ణయం సరైనదే అనిపించేలా భారత్ 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.కష్టాల్లో ఉన్న భారత్ ని ధోని, యువరాజ్ లు ఆదుకుని సెంచరీ లతో చెలరేగారు.యువరాజ్ 127 బంతుల్లో 150 పరుగులు చేయగా, ధోని 122 బంతుల్లో 134 పరుగులు చేసారు. వీరి ధాటికి భారత జట్టు 50 ఓవర్లలో 381 పరుగుల భారీ స్కోర్ సాధించింది.