పార్లమెంట్ లోకి ప్రవేశించిన యువరాజ్ సింగ్..!

Thursday, November 24th, 2016, 08:50:40 PM IST

uv
క్రికెట్ యువరాజు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఆరుబంతులకు ఆరు సిక్సర్లు, 2011 ప్రపంచకప్ లో అద్భుత పోరాటం ఇలా క్రికెట్ అభిమానులను అలరించిన యువరాజ్ సింగ్ పెళ్లి భాజా మోగించనున్నాడు. తన ప్రేయసి హాజల్ కీచ్ ని ఈ నెల 29 న యువి వివాహం చేసుకోబోతున్నాడు. దీనికోసం యువి అందరికి ఆహ్వాన పత్రికలు అందించే పని లో బిజీగా ఉన్నాడు. ప్రధాని నరేంద్ర మోడీని తన పెళ్లికి ఆహ్వానించడానికి యువి ఏకంగా పార్లమెంట్ కే వెళ్లాడు.

ప్రధానితో పాటు మంత్రులను రాజకీయ నాయకులను యువి ఆహ్వానించాడు. ఈ ఏడాది ఆరంభంలో యువీకి, హాజల్ కీచ్ కి నిశ్చితార్ధం ఇండోనేషియా బాలి ద్వీపం లో జరిగిన విషయం తెలిసిందే. కాగా మోడీని కలిసేందుకు ఏకంగా పార్లమెంటుకు వెళ్లిన యువరాజ్ పై సోషల్ మీడియాలో అనేక సెటైర్లు వినిపిస్తున్నాయి. పెద్ద నోట్లు రద్దైన తరుణం లో వివాహానికి రూ 2.5 లక్షలు మాత్రమే డ్రా చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనితో తన వివాహానికి ఎక్కువ డబ్బు ఇవ్వాలని మోడీని అడిగేందుకు వెళ్లాడా అంటూ సరదా కామెంట్లు వినిపిస్తున్నాయి.