షాక్ : యువరాజ్ సింగ్ పై గృహ హింస కేసు నమోదు..!

Wednesday, October 18th, 2017, 01:04:21 PM IST

భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ పై గృహ హింస చట్టం కింద కేసునమోదైంది. ఈ వార్త బయటకు రాగానే యువి అభిమానులంతా షాక్ కి గురయ్యారు. కానీ యువరాజ్ పై కేసునమోదు చేసింది అతడి సోదరుని భార్య. యువి సోదరుడు జరోవర్ సింగ్ భార్య ఆకాంక్ష శర్మ. ఆమెకు యువి కుటుంబానికి మధ్య గత కొన్ని రోజులుగా విభేదాలు నెలకొన్నాయి. దీనితో ఆకాంక్ష శర్మ తరుపున లాయర్ జరోవర్ సింగ్ తో పాటు, యువి, అతడి తల్లి షబ్నమ్ లపై కేసు నమోదు కేసు నమోదు చేశారు.

ఆకాంక్ష శర్మ పై వీరంతా మానసికంగా వత్తిడి తీసుకుని వచ్చినట్లు కేసు నమోదైంది. కొద్ది రోజులుగా జరోవర్, ఆకాంక్ష లు దూరంగా ఉంటున్నారు. వీరికి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కొడుకు ఎవరి వద్ద ఉండాలనే విషయంపై కూడా కోర్టులో కేసు నడుస్తోంది. మరో బిడ్డని కనాలంటూ ఆకాంక్షపై యువి కుటుంబ సభ్యులు మానసికంగా ఒత్తిడి తీసుకుని వచ్చారని ఆమె తరుపున లాయర్ స్వాతి మాలిక్ తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments