ట్రంప్ ప్రమాణ స్వీకారంలో అద్భుతం.. ఈ ఫొటోలో ఎవరిని జూమ్ చేసినా..!

Wednesday, January 25th, 2017, 12:06:50 PM IST

white-house
గత శుక్రవారం అమెరికా 45 వ అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. లక్షలాది గా అమెరికన్లు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో అమెరికా లో ప్రముఖ ఛానెల్ సిఎన్ఎన్ ఈ అద్భుతమైన ఫోటో తీసింది.గిగాపిక్సెల్ కెమెరా సాయంతో ఈ ఫోటో తీసింది. దీనిస్పెషలిటీ ఏంటంటే 360 డిగ్రీల కోణంలో ఈ ఫొటోలో కనిపించే ప్రతిఒక్కరి ముఖాన్ని స్పష్టం గా చూడవచ్చు.

మనం కోరిన వారి ముఖాన్ని ఈ ఫోటోలో జూమ్ చేసి చూడవచ్చు. కనుచూపు మేర విస్తరించిన ఉన్న లక్షలాది జనాభాలో ఎవరి ముఖాన్నైనా స్పష్టంగా జూమ్ చేయగలగడం ఈ ఫోటో లోని ప్రత్యేకత.ఆల్ట్రా హై రిసొల్యూషన్ తో తీసిన ఈ ఫోటో గ్రాఫ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరుకూడా ఈ క్రింద క్లిక్ చేసి ఫోటో లోని మ్యాజిక్ ని చూడవచ్చు.

ఫోటో కోసం క్లిక్ చేయండి