రష్యా హెలికాప్టర్ కూలి 15 మంది మృతి

Thursday, November 26th, 2015, 03:35:01 PM IST

రష్యాలోని సైబీరియాలో 22 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బందితో వెళుతున్న ఎంఐ8 హెలికాప్టర్ పశ్చిమ సైబీరియాలోని ఇగరక పట్టణ శివారులో కూలిపోయింది. ఈ ఘటనలో 15 మంది మృతిచెందగా, 10 మంది గాయపడినట్లు సమాచారం. కాగా, ఇగరక దగ్గర నుంచి ఓ ఆయిల్ పంపింగ్ స్టేషన్ కు వెళ్ళాల్సిన హెలికాప్టర్, స్థానిక విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన 15 నిమిషాల్లోనే కూలిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియలేదు.