విశాఖలో గన్ మెటల్ దొంగలు అరెస్ట్

Friday, November 27th, 2015, 03:52:35 PM IST

విశాఖలోని హిందూస్థాన్ షిప్ యార్డ్ లో తాజాగా గన్ మెటల్ చోరీ చేసిన ఏడుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో వారి వద్ద నుంచి 28 లక్షల రూపాయలు విలువ చేసే గన్ మెటల్ తో పాటు బ్రాంజ్ పైప్ లను కూడా స్వాధీనం చేసుకున్నారు. కాగా, అరెస్ట్ అయిన ఏడుగురిలో ఇద్దరిపై గతంలో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉందని, మరో ఇద్దరి పేర రౌడీషీట్ ఉందని పోలీస్ అధికారులు తెలిపారు. అలాగే ఈ మెటల్ ను సబ్ మెరైన్ ల నిర్మాణంలో వాడతారని ఆయన తెలియజేశారు.