డబ్బులివ్వలేదని తల్లిని నరికి చంపేసిన కొడుకు

Monday, November 30th, 2015, 04:04:33 PM IST

మెదక్ జిల్లా రాయదుర్గం మండలం ఐబీతండాకు చెందిన తులసీబాయి(50) అనే మహిళను జులాయి తిరుగుళ్ళకు అలవాటు పడిన ఆమె చిన్న కొడుకు నరేష్ డబ్బులు కోసం వేధించడమే పనిగా పెట్టుకున్నాడు. అదే క్రమంలో ఇంట్లో ఎవరూలేని సమయంలో తాజాగా మద్యం తాగేందుకు కొడుకు డబ్బులు అడగ్గా తులసీబాయి నిరాకరించింది. దీంతో కోపానికి లోనైన నరేష్ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న తల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ప్రస్తుతం అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.