టెక్సాస్ లో తుఫాన్.. 14 మంది మృతి

Monday, November 30th, 2015, 04:07:13 PM IST

అమెరికాలోని టెక్సాస్ ప్రాంతం కొన్నిరోజులుగా వరుస తుఫాన్లతో అల్లకల్లోలంగా మారిపోయింది. ఈ వర్షాల కారణంగా టెక్సాస్ లోని కొన్ని ప్రాంతాలు వరద ప్రభావానికి లోనయ్యాయి. అలాగే నదులన్నీ నిండుగా ప్రవహిస్తుండడం, మంచు తుఫాను కారణంగా నెమ్మదిగా కురుస్తున్న మంచు వర్షం వల్ల ఇప్పటివరకు దాదాపుగా 14 మంది మృతి చెందినట్లు సమాచారం. అంతేకాకుండా రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.