దట్టమైన మంచు కారణంగా రద్దయిన విమానాలు

Thursday, November 26th, 2015, 03:32:08 PM IST

శ్రీనగర్ లో దట్టమైన మంచు కమ్ముకున్న కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వరుసగా నాలుగో రోజు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన విమానాలు రద్దయ్యాయి. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు.. విమానం కిందకి దిగాలంటే ఎదురుగా 1000 మీటర్ల మేర కనిపించాలని, కానీ ఎదురుగా 300 నుంచి 400 మీటర్ల మేర ఉన్న ప్రాంతమే కనిపిస్తుందని తెలిపారు. ఈ కారణం చేతే గత మూడు రోజులుగా ఉదయం వేళల్లో విమానాలను రద్దు చేసినట్లు తెలియజేశారు.