వచ్చే ఉగాదికి పరుగులు పెట్టనున్న మెట్రో

Friday, November 27th, 2015, 04:00:13 PM IST

హైదరాబాద్ లో మెట్రో రైళ్ళ రాకపోకలు వచ్చే ఏడాది ఉగాది నాటికి ప్రారంభించే అవకాశాలున్నాయని ఎల్అండ్టీ మెట్రో రైలు మేనేజింగ్ డైరెక్టర్ వీబీ గాడ్గిల్ సూచనప్రాయంగా తెలియజేశారు. అయితే, ప్రారంభించే తేదీని మాత్రం ప్రభుత్వమే ప్రకటిస్తుందని అన్నారు. అలాగే ప్రస్తుతం మియాపూర్ -ఎస్ఆర్ నగర్ రూట్లో మెట్రో రైళ్లకు ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.