నాటుసారా దొరకలేదని ఆత్మహత్యాయత్నం

Friday, November 27th, 2015, 03:58:11 PM IST

ఖమ్మం జిల్లా కొత్తగూడెం మండలం సర్వారం గ్రామానికి చెందిన బిచ్చ(43) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుండగానే నాటుసారాకు విపరీతంగా బానిస అయ్యాడు. అయితే, కొన్ని రోజులుగా నాటుసారా దొరక్కపోవడంతో.. మనస్తాపానికి గురైన బిచ్చ తాజాగా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే గమనించిన స్థానికులు అతడిని కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.