సీమాంద్రకు పొంచివున్న మరో ప్రమాదం

Sunday, November 29th, 2015, 04:16:58 PM IST

వర్షాలతో ఇప్పటికే తడిసి ముద్దైన సీమాంద్రకు మరోగండం పొంచి ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. ద్రోణి ప్రాంతంలో 3.6 కిలోమీటర్ల వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని తెలిపింది. దక్షిణా కోస్తా, రాయలసీమలో నేడు, రేపు వర్షాలు పడతాయని పేర్కొంది. ఉత్తర కోస్తాలో చెదురుమదురుగా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. తమిళనాడులోనూ భారీగా వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం సూచించింది.