మేయర్ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ లొంగుబాటు

Monday, November 30th, 2015, 04:08:31 PM IST

చిత్తూరు మేయర్ అనురాధ, ఆమె భర్త కఠారి మోహన్ ల హత్యకేసులో ప్రధాన నిందితుడు, మోహన్ మేనల్లుడు అయిన చింటూ తాజాగా చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. ఈ సందర్భంగా నాలుగో అదనపు జూనియర్ సివిల్ జడ్జి యుగంధర్ ఎదుట లొంగిపోయిన చింటూ న్యాయమూర్తికి పలు డాక్యుమెంట్లు అందజేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో కోర్టు వద్ద భారీగా పోలీసులు మొహరించారు.