20 మందిని కాపాడిన స్కూల్ బస్ డ్రైవర్ మృతి

Monday, November 30th, 2015, 04:05:44 PM IST

ఒంగోలు క్రౌపేటలోని సెయింట్ మేరిస్ స్కూల్ కు చెందిన బస్సు తాజాగా 20 మంది విద్యార్ధులతో వస్తూ త్రోవగుంట వద్ద జాతీయ రహదారిపై అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని డీకొని, ఆపై రోడ్డు పక్కన ఉన్న భారీ నీటి గుంటలోకి ఒరిగిపోయింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, పెనుప్రమాదం తప్పడంతో విద్యార్ధుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ, తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడం అక్కడి వారిని కలచివేసింది. ఈ సందర్భంగా డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతోనే చిన్నారులు ప్రాణాలతో బయటపడ్డారని అధికారులు తెలిపారు.