కేసీఆర్ ను కలిసిన వరంగల్ ఎంపీ దయాకర్

Wednesday, November 25th, 2015, 02:18:50 PM IST

వరంగల్ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచిన పసునూరి దయాకర్ తాజాగా హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం పట్ల దయాకర్ ను సీఎం కేసీఆర్ అభినందించారు. అలాగే పార్లమెంట్ లో ప్రజల గళం వినిపించాలని సూచించారు. ఈ సందర్భంగా దయాకర్ తో పాటు వరంగల్ జిల్లా ముఖ్యనేతలు, ప్రచారంలో పాల్గొన్న మంత్రులు సీఎం కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.