మీరు ఎప్పుడు చనిపొతారో తెలుసుకోవాలని వుందా? అయితే ఇది చదవండి!

Sunday, June 4th, 2017, 01:45:20 PM IST


ప్రపంచంలో ప్రతి విషయాన్ని తెలుసుకోగలిగారు కాని పుట్టుక, చావు గురించి ఇప్పటి వరకు ఎవరు క్లేరిటి ఇవ్వలేకపోయారు. అయితే ఇందులో కూడా ఉప్ప్దో ముందడుగు పడింది. ఒక మనిషి ఎప్పుడు ఇంకా ఎన్నేళ్ళలో చనిపోతాడో చెప్పే ఒక యంత్రం ఇప్పుడు వచ్చేసింది. ఆటోమేషన్ టెక్నోలజితో పనిచేసే ఈ యంత్రం ఒక మనిషి శరీరంలో అవయవాలని స్కానింగ్ చేయడం ద్వారా ఆ వ్యక్తి ఇంకా చనిపోవడానికి రోజులు, నెలలు, సంవత్సరాలు ఉన్నాయా చెప్పేస్తుంది. ఆటోమేషన్ టెక్నాలజీ పని చేసే ఈ అప్లికేషన్ ని ఆస్ట్రేలియా లో అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపించారంట. ఈ అప్లికేషన్ అవయవాల స్కానింగ్ ఫోటోలని గుర్తించి వాటిలో మార్పుల ఆధారంగా ఆ వ్యక్తి ఎంత కాలంలో చనిపోవచ్చో చెప్పెస్తుందని సమాచారం. 69 మంది వ్యక్తుల అవయవాల రిపోర్ట్ ని ఈ అప్లికేషన్ తో పరీక్షించగా వారిలో 5 ఏళ్లలోపు ఎంత మంది చనిపొతారో ఈ టెక్నాలజీ గుర్తించిందని తెలుస్తుంది. అయితే ఇది నిజంగా నిజమే అయితే వైద్య శాస్త్రంలో సరికొత్త మార్పులకి ఇది మూలం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.