మీరు జియో ఫోన్ కొనాలంటే ఇలా చేయండి!

Monday, February 12th, 2018, 02:45:05 PM IST

ప్రముఖ టెలికాం సంస్థ జియో ప్రవేశపెట్టిన 4జి వోల్ట్ ఆధారిత ఫీచర్ ఫోన్ మంచి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. వినియోగదారులనుండి బాగా డిమాండ్ పెరిగిన దృష్ట్యా కొన్నాళ్ల పాటు ఈ ఫోన్ అమ్మకాలను నిలిపివేసింది జియో. మొదట్లో ఈ ఫోన్ కొన్న వినియోగదారులకు నెలకు రూ. 153 గా రీఛార్జి ఉండేది. అయితే అది ప్రస్తుతం రూ.49 నూతన రీఛార్జి ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ ఫీచురే ఫోన్ ని మోబిక్విక్ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసిన అవకాశాన్ని కల్పిస్తోంది జియో.

ఇప్పటివరకు తమ సొంత వెబ్ సైట్ లోనే లభ్యమయ్యే ఈ మొబైల్ ఇకనుండి ఈ థర్డ్ పార్టీ వెబ్ సైట్ ద్వారా కూడా అందుబాటులోకి రావడంతో వినియోగదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా మోబిక్విక్ వెబ్ సైట్ లో లాగిన్ అయి అందులో రేచర్గే ఆప్షన్ ని ఎంచుకుని అక్కడ స్క్రీన్ పై కనిపించే ఫోన్ బుకింగ్ ఆప్షన్ ని ఎంచుకొని మన వివరాలు నింపి, పేమెంట్ చేయగానే మీకు దగ్గరలోని జియో పిక్ అప్ స్టోర్ వివరాలతో కూడిన ఎస్ ఎమ్ ఎస్ మన ఫోన్ కు వస్తుంది. అయితే ఈ నూతన విధానం ద్వారా తమ ఫోన్ అమ్మకాలు మరింత పెరుగుతాయని జియో ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు…..