దోమలకు టీవీ తో చెక్ పెట్టొచ్చట..!

Wednesday, June 8th, 2016, 09:59:50 AM IST


ఇంతకు ముందు ఏదో ఒకకాలంలో మాత్రమే దోమలు వచ్చేవి. కొంతకాలం తరువాత కనిపించేవి కాదు. కాని, ఇప్పుడు కాలంతో పనిలేకుండా.. 365 రోజులు దోమలు మనుషుల్ని కుడుతున్నాయి. రాత్రి పూట దోమల కంటే పగటివేళ సంచరించె దోమల వలన ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. మస్కిటో కాయిల్స్, ఎలక్ట్రికల్ బ్యాట్స్ తదితర వస్తువులను వాడినప్పటికీ దోమల వలన ఇబ్బందులు తప్పడంలేదు.
దోమలకు చెక్ పెట్టేందుకు దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం ఎల్జీ తాజాగా మస్కిటో టీవీ ని లాంచ్ చేసింది. టీవీ లో దఅల్ట్రా సోనిక్ తరంగాల పరికరం అమర్చినట్టు ఎల్జీ కంపెనీ పేర్కొన్నది. ధ్వని తరంగాల ఆధారంగా దోమలు పారిపోతాయని, ఇందులో ఎటువంటి రసాయనాలు వాడలేదని, మనుషులకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు రావని కంపెనీ చెప్తున్నది. ఇక దీని ధర 26,900/- నుంచి 47,500/- గా ఉన్నదట. ప్రస్తుతం ఎంపిక చేసిన షోరూమ్స్ లో మాత్రమే ఇవి అందుబాటులో ఉన్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. త్వరలోనే అన్ని ఔట్లెట్స్ లో అందుబాటులో ఉండేవిధంగా ప్లాన్ చేస్తున్నట్టు కంపెనీ మేనేజ్మెంట్ పేర్కొన్నది.