లో బడ్జెట్, హై ఫీచర్స్ తో మొబైల్స్ ని విడుదల చేస్తున్న పానాసోనిక్

Thursday, February 8th, 2018, 02:00:49 PM IST

ప్రస్తుత డిజిటల్ యుగం లో రోజుకొక రకం వస్తువుల రాక చూస్తున్నాం. అదే టెలికాం కంపెనీ లు ఒకరిపై ఒకరు పోటీ పడి మరీ ప్లాన్లు, ఆఫర్లు ప్రకటించడం చూస్తున్నాం. అలానే మొబైల్ తయారీ కంపెనీ లు కూడా వారానికో రకం లెక్కన తమ తమ నూతన ఉత్పత్తులను విడుదల చేస్తున్నాయి. పెన్ లేని జేబు చూడగలమేమో గాని ప్రస్తుతం మొబైల్ లేని జేబు చూడలేమేమో అన్నట్లుంది ప్రస్తుత కాల పైరిస్థితి. లేటెస్ట్ గా స్మార్ట్ ఫోన్ యుగం నడుస్తుండడం, అందునా అందరికి అందుబాటు ధరల్లోనే ఇవి లభ్యం కావడంతో కంపెనీలు ప్రస్తుత పోటీ తట్టుకోవడానికి కొత్త కొత్త ఫీచర్లు, అందుబాటు ధరలతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ మధ్య షియోమీ కంపెనీ రూ.4999 కె 5a పేరుతో ఆన్లైన్ లో మొబైల్ అమ్మకాలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు దీన్ని ఛాలెంజ్ చేస్తూ ప్యానాసోనిక్ తాజాగా పీ100 పేరుతో స్మార్ట్ ఫోన్ ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది.

ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే ఇది అమ్మకానికి ఉంటుంది. పీ100లో రెండు మోడళ్ళను తీసుకొచ్చింది. ఇవి షియోమీ 5ఏకు గట్టిపోటీనిచ్చేలా ఉన్నాయి. ఇందులో 1జీబీ ర్యామ్, 2జీబీ ర్యామ్ రెండు వెర్షన్లున్నాయి. రెండింటిలోనూ స్టోరేజీ కెపాసిటీ 16 జీబీనే. అంతే కాక మైక్రో ఎస్డీ కార్డు మెమరీ ఆప్షన్ ఉంది. ప్రతీ దానికి విడిగా డెడికేటెడ్ స్లాట్ ఇచ్చారు. 5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7 నౌగట్ ఓఎస్, 1.25 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ఎంటీ 6737 ప్రాసెసర్, వెనుక 8ఎంపీ, ముందు 5ఎంపీ కెమెరాలు, రెండు వైపులా ఫ్లాష్ సదుపాయం, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2,200 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి. గోల్డ్, బ్లూ, బ్లాక్ రంగుల్లో లభయం కానున్నాయి. 1జీబీ ర్యామ్ ధర రూ.5,299, 2జీబీ ర్యామ్ ధర రూ.5,999. ఈ నెల 8 నుంచి 31లోపు కొనుగోలు చేసిన వారు బంగారం గెలుచుకునే ఆఫర్ ను కంపెనీ ప్రకటించింది. అయితే ప్రస్తుతం షియోమీ కి పోటీగా అమెజాన్ 10 ఆర్ డి మొబైల్ ని విడుదల చేసిన విషయం తెలిసిందే…