ఈ ఇల్లు ఇన్స్టాగ్రామ్ లో సెలబ్రిటీ అయిందట..!

Tuesday, June 7th, 2016, 06:18:55 PM IST


ఇన్స్టాగ్రామ్.. ఇప్పుడు సోషల్ మీడియాలో రంగంలో ఎక్కువ మంది వినియోగిస్తున్న మాధ్యమం. పాపులర్ కావడానికి ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మామూలు వ్యక్తులతో సమానంగా ఓ ఇల్లు పాపులర్ అయింది. టీవీ షోల లోను, హాలీవుడ్ చిత్రాలలోనూ ఆ భవనం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇంతగా ఆ ఇల్లు ఆకట్టుకోవడానికి కారణం ఏమిటి.. అసలు అంతటి ఆకర్షణ వెనుకున్న ఆ రహస్యం ఏమిటి ఇప్పుడు చూద్దాం.

2010 వ సంవత్సరంలో బ్రియాన్ ఉల్ఫ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంటికి వాల్టేజ్ అనే ఆర్టిస్ట్ కొన్ని రంగులను సూచించాడు. ఆయన చెప్పినట్టుగానే ఆ ఇంటికి రంగులను వేశారట. దీంతో ఇంటికి అద్బుతమైన కళ వచ్చింది. అప్పటి నుంచి ఈ ఇల్లు వెలుగులోకి వచ్చింది. 2011 వ సంవత్సరంలో ఓ ప్రముఖ పత్రికలో ఈ ఇంటి గురించి వచ్చింది. తరువాత, ఆ ఇంటిని వేలాది మంది సందర్శించారట. అందులో హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా ఉన్నారని యజమాని చెప్తున్నారు. ఇక ఈ ఇల్లు ఇన్స్టాగ్రామ్ 1,50,000 సార్లు పోస్ట్ అయిందట. ఇన్నిమార్లు ఇక పోస్ట్ కావడం ఒక రికార్డ్ అని అంటున్నారు.