వన్ ప్లస్ 3 కి ముహూర్తం కుదిరింది

Thursday, May 26th, 2016, 03:51:10 PM IST


సెర్చ్ ఇంజన్ లో టాప్ ప్లేస్ లో ఉన్న గూగుల్ కంపెనీ తాజాగా మొబైల్ ఉత్పత్తి తయారీ రంగంలోకి అడుగుపెట్టింది. గూగుల్ సంస్థ నెక్సస్ కంపెనీ కోలాబరేట్ అయ్యి వన్ ప్లస్ మొబైల్ ను తయారు చేసింది. సంవత్సరం క్రితం వన్ ప్లస్ టూ మొబైల్స్ విపణిలోకి వచ్చాయి. ఈ మొబైల్స్ అనుకున్న విధంగానే ప్రజలలోకి వెల్లగలిగింది. వన్ ప్లస్ 2 మొబైల్స్ ను ఈ కామర్స్ కంపెనీల ద్వారా అమ్మకం జరిగిపిన సంగతి విదితమే.

ఇక ఇదిలా ఉంటే, గూగుల్ కంపెనీ వన్ ప్లస్ 3 మొబైల్స్ ను త్వరలోనే విపణిలోకి ప్రవేశపెట్టబోతున్నది. వన్ ప్లస్ 2 భారీ హిట్ కావడంతో.. వన్ ప్లస్ 3 మొబైల్స్ ను ఎప్పుడు విడుదల చేస్తారా అని ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు.. చూస్తున్నారు. అయతే, మనకు అందుతున్న తాజా సమాచారం ప్రకారం ఈ ఏడాది జూన్ 14 వ తేదీన వన్ ప్లస్ 3 మొబైల్స్ ను మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది. 5.5 అంగుళాల స్క్రీన్ కలిగిన వన్ ప్లస్ 3 మొబైల్స్ లో స్నాప్ డ్రాగన్ 820 సిపీయు ప్రాసెసర్ ను కలిగి ఉన్నది. 4 లేదా 6 జీబీ ర్యామ్ తో 64 జీబీ ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంటుందని తాజా సమాచారం బట్టి తెలుస్తున్నది.