సెల్లు పెట్టే చిల్లు.. కంటిచూపు, వినికిడి హాంఫ‌ట్‌!

Monday, August 15th, 2016, 06:01:39 PM IST


సెల్‌ఫోన్ అర‌చేతిలో ప్ర‌పంచం చూపించ‌డ‌మే కాదు.. అర‌చేతిలో వైకుంఠాన్ని ఆవిష్క‌రించ‌డ‌మే కాదు.. మ‌నిషి జీవితాల‌తోనూ అంతే వీజీగా ఆడుకోగ‌ల‌దు. ఇప్ప‌టికే సెల్‌ఫోన్ తెచ్చిన ముప్పుపై ప‌లుర‌కాల ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

చెవికి శ‌బ్ధ త‌రంగాల తాకిడి వ‌ల్ల వినికిడి శ‌క్తి కోల్పోవ‌డ‌మే కాదు అంధ‌త్వం కూడా వ‌స్తోంద‌న్న‌ది నిపుణుల మాట‌. పైగా సెల్లు ఫోన్‌ని ప‌రిశుభ్రంగా వినియోగించ‌క‌పోవ‌డం వ‌ల్ల ఇ-కొలి అనే బాక్టీరియా జీర్ణాశ‌యంపై తీవ్ర ప్ర‌భావం చూపుతోంది. త‌ద్వారా మ‌నిషి అనారోగ్యానికి కార‌ణ‌మ‌వుతోంద‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. సెల్ ఎంత ఉప‌యోగ‌మో.. అంత ప్ర‌మాద‌మ‌ని ఆరోగ్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక సెల్ఫీల పిచ్చితో వ‌చ్చే ముప్పు, క్యాన్స‌ర్లు, డ్రైవింగ్‌లో ప్ర‌మాదాలు.. ఇవ‌న్నీ ఉండ‌నే ఉన్నాయి. కాబ‌ట్టి సెల్లుతో జ‌ర‌భ‌ద్రం త‌మ్మీ.. ! త‌స్మాత్ జాగ్ర‌త్త‌!!