బీర్ ఆరోగ్యానికే కాదు.. హార్ట్ కు కూడా మంచిదే..!

Friday, April 29th, 2016, 03:07:07 PM IST


మొన్నటి వరకు బీర్ తాగడం వలన ఆరోగ్యం చెడిపోతుందని.. పొట్ట పెరిగే అవకాశం ఉంటుందని వార్తలు వెలువడ్డాయి. అయితే, ఇవన్నీ కేవలం అపర్దాలే అని తేలిపోయింది. బీర్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదే అని, అయితే, రోజు కాకుండా వారంలో మూడు సార్లు మూడు గ్లాసుల చొప్పున తీసుకోవడం ఉత్తమం అని పరిశోధనలో తేలింది. బీరు వలన కిడ్నీలో రాళ్ళు ఉంటె తొలగించబడతాయట. బీర్ ప్యురిఫైయర్ గా పనిచేస్తుంది. ఇక ఇదిలా ఉంటె, వారంలో మూడు సార్లు తీసుకుంటే.. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం 30 శాతం తగ్గిపోతుందని తాజా పరిశోధనలో తేలింది. బీర్ తాగని వారి కంటే బీర్ తాగే వారికి హాట్ ఎటాక్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని సర్వే పేర్కొన్నది. ఇక ప్రతిరోజు ఒకటి లేదా రెండు గ్లాసుల బీర్ తీసుకుంటే షుగర్ వ్యాధి 25 శాతానికి పైగా తగ్గుతుందని సర్వే పేర్కొన్నది. బీర్ అల్జీమర్స్ ను తగ్గిస్తుందట. అంతేకాకుండా మెదడును చురుగ్గా పనిచేసే విధంగా కూడా చేస్తుందట.