తాజ్ మహల్ – చందమామ కలిస్తే.. ఇలా ఉంటుంది

Thursday, October 5th, 2017, 01:58:14 PM IST

ప్రపంచ ఏడు వింతల్లో ఒకటైన తాజ్ మహల్ ఎంత అద్భుతంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివిధ దేశాలనుండి పర్యాటకులు తాజ్ మహల్ ని చూడటానికి వస్తారు. ముఖ్యంగా వెన్నల్లో చందమామ ఎంత అందంగా ఉంటుందో తాజ్ మహల్ కూడా అంతే అందంగా మెరుస్తూ ఉంటుంది. ప్రేమకు చిహ్నంగా చెప్పుకునే ఈ అద్భుత తాజ్ ని చాలా మంది ప్రేమికులు ఇష్టపడతారు. అయితే శరదృతువులో ఆశ్వయుజ మాసంలో వచ్చే పున్నమి రోజు తాజ్ మహల్ చంద్రుడు తేజస్సుకు అందంగా కనిపిస్తుంది. ఆ రోజును శరద్ పూర్ణిమ అంటారు. చాలా వరకు చంద్రుడి ఉష్ణోగ్రత ఆ రోజు చాలా తక్కువగా ఉంటుంది. భూమికి దగ్గరగా చంద్రుడు వచ్చినప్పుడు ఎంతో ప్రకాశవంతంగా వెలిగిపోతాడు. అప్పుడు తాజ్ మహల్ పై ఆ వెన్నెల పడుతుంటే చూసేందుకు రెండు కళ్లు చాలవనే చెప్పాలి. ఇప్పటికే దేశ విదేశాలనుండి పర్యాటకులు వస్తున్నారు. ఈ రోజు రాత్రి 8.30 నుంచి 12.30 గంటల వరకు చంద్రుడి కాంతికి తాజ్ మహల్ చాలా మెరిసిపోతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.