శృంగారంలో వీకా..? అయితే ఇవి తినండి!

Tuesday, October 18th, 2016, 11:40:16 AM IST


ఒత్తిడిల జీవితంలో శృంగార జీవితానికి దూర‌మైపోతోంది నేటి త‌రం. రోడ్ల‌పై జంక్ ఫుడ్స్ తిని ఆరోగ్యం పాడు చేసుకోవ‌డ‌మే కాదు.. అందుకు ప‌నికిరాకుండా పోతున్నారు. అలాంటి వారికి ఈ డైట్ బాగా ప‌నికొస్తుంద‌ని స‌ల‌హా ఇస్తున్నారు డాక్ట‌ర్లు.

హార్మోన్ల‌ను ప్రేరేపించేందుకు నిత్యం పాలు, తేనె తీసుకోవాల‌ని స‌ల‌హా ఇస్తున్నారు డాక్ట‌ర్లు. ఇది అంద‌రికీ తెలిసిన చిట్కానే అయినా ప‌ట్టించుకోక‌పోవ‌డ‌మే స‌మ‌స్య అని అంటున్నారు. ఇక వీటితో పాటు బాదం, ఖ‌ర్జూరం, మొల‌కెత్తిన విత్త‌నాలు, గుడ్లు, తాజా ఆకు కూర‌లు తీసుకుంటే మెద‌డుకు మేలు చేసి ర‌సాస్వాద‌న క‌లిగిస్తాయ‌ట‌. కీర దోసకాయ‌, క్యార‌ట్‌, బీట్‌రూట్‌తో త‌యారుచేసిన జ్యూస్‌ను రోజు ఉద‌యం ఓ గ్లాసు తీసుకోవాలి. యాపిల్‌, జామ‌, దానిమ్మ‌, ద్రాక్ష‌, నేరేడు వంటి తాజా పండ్ల‌ను విధిగా తీసుకుంటే బెడ్‌పై సామ‌ర్థ్యం పెరుగుతుంది. ప్ర‌తిరాత్రి శోభ‌నం రాత్రిలా ఉండాలంటే ఆమాత్రం ప్లాన్ చేయాలి మ‌రి!