2.0 అఫిషియ‌ల్.. మొద‌లైన సంచ‌ల‌నాలు..!

Thursday, November 1st, 2018, 10:42:12 AM IST

సుప‌ర్ స్టార్ ర‌జ‌నీ కాంత్- సెన్షేష‌న్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘2.0. దేశం మొత్తం భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్ర ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 3న విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ఇండియా సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ బ‌డ్జెట్‌, క‌ళ్ళు చెదిరే గ్రాఫిక్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం.. అనేక వాయిదాలు త‌ర్వాత న‌వంబ‌ర్ 29న ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌నున్నామ‌ని చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఈ క్ర‌మంలో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్ల‌ను ఓ రేంజ్‌లో మొద‌లుపెట్టింది.

ఈ నేప‌ధ్యంలో తాజాగా 2.0 పోస్ట‌ర్లు విడుద‌ల చేశారు మేక‌ర్స్. ది వరల్డ్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్ అంటూ కాప్షన్ ఉన్న 2.0 సినిమా పోస్టర్లు వీక్షకులను ఆకర్షిస్తున్నాయి. ఇక క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో భారీ బ‌డ్జెత్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం.. రికార్డులు సృష్టించే ఓపెనింగ్స్ దక్కాలంటే, తాజాగా విడుద‌ల కాబోయే 2.0 ట్రైలర్ చాలా కీలకమని ట్రేడ్ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నారు. వెండితెర పై 2.0 విజువల్ వండర్ ఖాయమని చిత్ర యూనిట్ చెప్తున్నప్పటికీ, అవి ఏ స్థాయిలో ఉంటాయనేది వేచిచూడాలి. ఇక ఈ చిత్రంలో విల‌న్‌గా బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టిస్తుండ‌గా.. ఇంగ్లీష్ భామ అమీ జాక్స‌న్ త‌న అందాల‌తో క‌నుల‌విందు చేయ‌నుంది.

  •  
  •  
  •  
  •  

Comments