“2.0” – అరుదైన ఘనత

Saturday, October 27th, 2018, 07:49:18 PM IST

రోబో లాంటి బారి హిట్ తర్వాత అదే కాంబినేషన్ లో, ఆ చిత్రానికి కొనసాగింపుగా వస్తున్నా చిత్రం “2.0”, ఈ చిత్రం షూటింగ్ పూర్తయి ఏడాది కావస్తున్నా వీఎఫ్ఎక్స్ పనుల్లో జాప్యం వలన విడుదల వాయిదా పడుతూ వస్తుంది, ఈ చిత్రం యొక్క టీజర్ ఇటీవలే విడుదలై అందరిని ఆకట్టుకొని అంచనాలు పెంచేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ చిత్రం ట్రైలర్ ను దీపావళి కి విడుదల చేయాలనీ చిత్ర బృందం నిర్ణయించింది. ఈ నేపథ్యం లో ట్రైలర్ గురించిన ఒక ఆసక్తికరమైన వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతుంది, వివరాల్లోకి వెళితే ఈ చిత్రం 3D టెక్నాలజీ లో రూపొందుతున్న విషయం తెలిసిందే, 3D అనుభూతి పొందాలంటే ఆ టెక్నాలజీ తో అనుసందానం ఉన్న థియేటర్లలోనే చూడాలి. తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ చిత్ర ట్రైలర్ ను 4D సౌండ్ టెక్నాలజీ తో రూపొందించారంట. చెన్నై లోని సత్యం సినిమాస్ లో ట్రైలర్ విడుదల కార్యక్రమం నిర్వహించి అక్కడే ట్రైలర్ విడుదల చేయాలని నిర్ణయించారట. ఇదే గనక నిజమైతే భారతదేశం మొత్తం మీద తొలిసారిగా 4D సౌండ్ టెక్నాలజీ తో రూపొందిన చిత్రంగా ఘంటా సాధిస్తుంది.

భారీ స్థాయిలో నిర్మింప బడుతున్న ఈ చిత్రం బడ్జెట్ రూ,.450 కోట్లు. ఇందులో తలైవా సరసన అమీ జాక్సన్ కథానాయిక గా నటిస్తుండగా అక్షయ్ కుమార్ ప్రతినాయక పాత్ర పోషిస్తున్నారు, ఏ ఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూరుస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో నిర్మింపబడి, అంతే భారీ అంచనాలతో విడుదలకి సిద్ధపడుతున్న ఈ చిత్రం ఏ మేరకు మెప్పిస్తుందో విడుదల వరకు వేచి చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments