“RRR” బయటకొచ్చిన లేటెస్ట్ అప్డేట్..!

Tuesday, December 10th, 2019, 11:40:13 PM IST

ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రపై తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం “RRR”. ఈ చిత్రం ద్వారా మరోసారి తెలుగు సినిమా ఖ్యాతిని దేశ వ్యాప్తంగా మాత్రమే కాకుండా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రాజమౌళి ప్రణాళికలు వేస్తున్నట్టుగా ఇప్పటికే వార్తలు బయటకు వచ్చాయి.

ఇప్పుడు మరోసారి మరో వార్త ఈ చిత్రంపై బయటకు వచ్చింది.ప్రస్తుతానికి అయితే ఈ చిత్రం దాడ్పుదాడ్పుదాదాపు 80 శాతం షూట్ పూర్తయ్యిందని అలాగే చరణ్ మరియు ఎన్టీఆర్ లకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే ఇంకా బాకీ ఉన్నాయని తెలుస్తుంది.అలాగే వచ్చే ఏడాది ఫిబ్రవరి కల్లా రామ్ చరణ్ పై మిగిలి ఉన్న షూటింగ్ టాకీ పార్ట్ ను పూర్తి చేసేసి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించి తాను అనుకున్న సమయానికి చిత్రాన్ని ఎలా అయినా సరే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని రాజమౌళి అనుకుంటున్నారని సినీ వర్గాల్లో ఇప్పుడు టాక్ నడుస్తుంది.మరి రాజమౌళి ఈ చిత్రాన్ని ఎలా తెరకెక్కిస్తున్నారో చూడాలి.